గుండీలోని హిందూస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్ Eureka-STEAM Exhibition 2019 పేరుతో ఒక అవగాహనా సదస్సును నిర్వహించింది. సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారిని ప్రొత్సహించడంతో పాటు ట్రాన్స్‌ డిసిప్లీనరీ లెర్నింగ్‌ ప్రాజెక్టుల వల్ల విద్యార్ధుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మకత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల్లో విద్యార్ధులకు ఒక ప్రత్యేకమైన వేదికను ఈ ప్రదర్శన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి.రామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగాన్ని చేశారు.