ఓ కన్నతల్లి కూతురి మీద అత్యంత నీఛమైన పనికి పూనుకుంది. ప్రియుడితో అత్యాచారం చేయించి, అక్రమంగా అండసేకరణ చేసి అమ్ముకుంటూ వచ్చింది. చివరికి... 

తమిళనాడు : tamilnduలో కలలో కూడా ఊహించని దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కన్నతల్లే.. నవమాసాలూ మోసి కన్న కూతురి పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించింది. యుక్తవయసుకు వచ్చిన కూతురికి అచ్చటా, ముచ్చటా జరిగిపించాల్సిన తల్లి.. తన ప్రియుడితో ఆమె మీద molestation చేయించింది. ఐదేళ్లపాటు అలాగే అత్యాచారాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాదు.. కూతురినుంచి అక్రమంగా embryo సేకరణ చేసి illegal surrogacyకి అమ్ముకుంది. చదువుతుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మీద ఇప్పుడు కలకలం రేగుతోంది. 

 ఈ రోడ్ లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్బంధం వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్నతల్లి తన కూతురు నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి… అక్రమ సరోగసీ కోసం ఆసుపత్రులకు అమ్మేసుకుంది. పైగా, ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. తమిళనాడు ఈరోడ్ లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టోరేట్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ విశ్వనాధం నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్ హోమ్ లో ఉన్న బాధితురాలిని పరామర్శించిన మూడు గంటల పాటు ప్రశ్నించారు.

ఈ రోడ్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్ సరోగసి వ్యవహారం నడిపినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ రోడ్ కు చెందిన నిందితురాలు (33) భర్తకు దూరంగా ఉంటోంది. తనతో పాటు బిడ్డను కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అది అలా కొనసాగిస్తున్న క్రమంలోనే.. కూతురు యుక్త వయసుకు రాగానే తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా బాధితురాలిపై అత్యాచారపర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను సేకరించి.. ఆసుపత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులు పంచుకుంటూ వస్తున్నారు. 

అంతేకాదు.. కూతురి వయసును ఆధార్ కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు. ఆధార్ కార్డులో ఆమె వయసును 22 యేళ్లుగా మార్ఫింగ్ చేయించారు. ఇప్పటికి పలు దఫాలుగా.. 8 సార్లు ఆమె నుంచి అండ సేకరణ చేసి అమ్ముకున్నారు. ఇలా చేసిన ప్రతీసారి తల్లికి, ఆమె ప్రియుడికి రూ.20వేలు ఆయా ఆసుపత్రుల నుంచి ముట్టేవి. మద్యవర్తికి రూ.5 వేలు వచ్చేవని పోలీసులు తెలిపారు. 

జూన్ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరార్ అయ్యింది. సేలంలోని తన స్కూల్ స్నేహితురాలు ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. Pocso act, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్ మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అంతే కాదు అక్రమ సరోగసీ పాల్పడిన ఆసుపత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ.