Sriharikota: అంతరిక్ష రంగంలో ప్రయివేటు సంస్థల ప్రవేశం ఇస్రో సామర్థ్యాన్ని మరింతగా పెంపొందిస్తుందనికేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ అంతరిక్ష కార్యకలాపాల ఆర్థిక వ్యవస్థను విస్తరించడమే లక్ష్యంగా ఈ కొత్త ప్రయాణమని తెలిపారు.
ISRO-Union Minister Jitendra Singh: భారత అంతరిక్ష వ్యవస్థలోకి ప్రయివేటు సంస్థలు ప్రవేశించడం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సామర్థ్యాలను మరింతగా పెంపొందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. 'ప్రరంభ్' అనే మిషన్ కింద స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించిన వెంటనే.. ప్రధాని కార్యాలయంలోని సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) అంతరిక్ష పరిశ్రమలోకి ప్రయివేటు కంపెనీల ప్రవేశం భారత అంతరిక్ష సంస్థకు అనుబంధంగా ఉంటుందని చెప్పారు. ప్రధాని మోడీ దీనిని చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు.
భారతదేశపు మొట్టమొదటి ప్రయివేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైన వెంటనే, లాంచింగ్ సైట్‌కు స్వయంగా హాజరైన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. “భారతదేశానికి అభినందనలు! భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త ప్రారంభం! అంతరిక్ష రంగాన్ని పబ్లిక్- ప్రయివేటు భాగస్వామ్యానికి తెరవడం ద్వారా ఈ ప్రయత్నాన్ని సాధ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ. భారతదేశ స్టార్టప్ ఉద్యమానికి ఒక మలుపు! ఇస్రోకు వందనాలు” అని పేర్కొన్నారు. ప్రయివేటు భాగస్వామ్యం కోసం 2020లో ప్రధాని మోడీ అంతరిక్ష రంగాన్ని అన్‌లాక్ చేసిన తర్వాత ఇస్రో ప్రయాణంలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని మంత్రి చెప్పారు.
"మిషన్ ప్రరంభ్ విజయవంతంగా పూర్తి చేయబడింది" అని ఇస్రో పేర్కొనగా, "ఆకాశంలో మెరిసిన భారతదేశపు మొట్టమొదటి ప్రయివేటు రాకెట్ గా విక్రమ్-ఎస్ చరిత్ర సృష్టించింది" అని స్కైరూట్ ఏరోస్పేస్ పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేడు భారతదేశ మొట్టమొదటి ప్రయివేటు విక్రమ్-సుబోర్బిటల్ (వికెఎస్) రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించిందని తెలిపింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ అయిన ఇస్రో, స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి! భారతీయ స్టార్టప్ లకు ఒక టర్నింగ్ పాయింట్! ఇస్రోకు ఒక కొత్త ఆరంభం" మొట్టమొదటి ప్రయివేటు రాకెట్ 'విక్రమ్-ఎస్' అంతరిక్షంలో దూసుకెళ్లింది" అని మంత్రి పేర్కొన్నారు.
