Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్స్ కి బర్త్ డే పార్టీ .. మహిళమీద దాడి చెవిరింగులు దొంగిలించి..ఇంజనీర్ నిర్వాకం.. !!

నిందితుడు, మోహిత్ గౌతమ్ అలియాస్ లవ్, షాహదారాలోని జ్యోతి నగర్ నివాసి. శుక్రవారం, మన్సరోవర్ పార్క్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బైక్ మీద వచ్చి ఓ మహిళ చెవికున్న బంగారు చెవిరింగులను లాక్కోని పారిపోయాడు. దీనిమీద కేసు నమోదైంది.

Engineer Snatches Woman's Earrings To Fund Birthday Celebration : Police - bsb
Author
Hyderabad, First Published Jul 28, 2021, 9:38 AM IST

న్యూఢిల్లీ : బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మహిళ చెవిరింగులు బెదిరించి లాక్కున్నాడో ప్రబుధ్దుడు. అలాగని అతను చదువుకోని వాడా అంటే కాదు.. జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 31 యేళ్ల ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

నిందితుడు, మోహిత్ గౌతమ్ అలియాస్ లవ్, షాహదారాలోని జ్యోతి నగర్ నివాసి. శుక్రవారం, మన్సరోవర్ పార్క్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బైక్ మీద వచ్చి ఓ మహిళ చెవికున్న బంగారు చెవిరింగులను లాక్కోని పారిపోయాడు. దీనిమీద కేసు నమోదైంది.

దర్యాప్తులో, పోలీసులు 30 సిసిటివి ఫుటేజీలను తనిఖీ చేశారు. స్నాచర్  ఎలా లాక్కున్నాడు. ఎలా పారిపోయాడో గమనించారు. నిందితుడికి సంబంధించి స్నాప్ షాట్స్ తీసి ఎన్ లార్ట్ చేసి చూశారు. వాటిల్లో  ముఖానికి మాస్క్ తో స్నాచర్ కనిపించాడు.  ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, అతను తప్పించుకున్న వెహికిల్ ముందూ, వెనక రెండు నంబర్ ప్లేట్లలోనూ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించలేదు. 

దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఆదివారం, జగత్‌పురి వైన్ షాపులో దగ్గర ఖాళీ నంబర్ ప్లేట్లతో అలాంటి మోటారుసైకిలే కనిపించింది.  దీంతో వాహనాన్ని ఆపి నిందితుడు గౌతమ్‌ను పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.

విచారణ సమయంలో గౌతమ్ తాను బీఎస్ఈఎస్‌లో కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్ అని వెల్లడించాడు. ఆదివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఆ మహిళ చెవిరింగులను లాక్కున్నట్లు చెప్పాడు. 

ఆ రింగులను హదారాలోని అశోక్ నగర్లో ఉండే సురేందర్ అనే ఓ గోల్డ్ స్మిత్ కు అమ్మానని గౌతమ్ చెప్పాడు. అతని కోసం పోలీసులు వెళ్లగా సురేందర్ పరారీలో ఉన్నాడని వారు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios