Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ కి బెయిల్.. డిల్లీ హైకోర్టుకు ఈడీ..!

ఆయన ఇంకా బయటకు రాకముందే.. ఈడీ అధికారులు... ఆయన మెడకు మరో ఉచ్చు బిగించడానికి రెడీ అయ్యారు. ఆయనకు మంజూరు చేసిన బెయిల్ ని ఛాలెంజ్ చేస్తూ.... భిల్లీ హైకోర్టును ఆశ్రయించారు

Enforcemet Directorate moves Delhi High court Against Arvind Kejriwal  ram
Author
First Published Jun 21, 2024, 11:16 AM IST | Last Updated Jun 21, 2024, 11:16 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనపడటం లేదు. ఇప్పటికే.. ఈ కేసులో ఆయన అరెస్టు అయిన విషయం తెలిసిందే. కాగా.. ఎట్టకేలకు ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీ కత్తుతో ఆయనకు బెయిల్ ఇచ్చింది.  ఈ క్రమంలో ఆయన ఈ రోజు విడుదల కానున్నారు.

అయితే... ఆయన ఇంకా బయటకు రాకముందే.. ఈడీ అధికారులు... ఆయన మెడకు మరో ఉచ్చు బిగించడానికి రెడీ అయ్యారు. ఆయనకు మంజూరు చేసిన బెయిల్ ని ఛాలెంజ్ చేస్తూ.... భిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిల్ ను  హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఈడీ తరపు న్యాయవాదులు ఈ అంశాన్ని అత్యవసర విచారణకు కోరే అవకాశం ఉంది. ఈడీకి అనుకూలంగా కోర్టు నిర్ణయం తీసుకుంటే.. మళ్లీ కేజ్రీవాల్ కి ఇచ్చిన బెయిల్ వాయిదా పడే అవకాశం ఉంది. 

కాగా... ఈ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.100కోట్లు డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చెబుతున్నారు. కానీ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ కేజ్రీవాల్ వాదిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios