Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో మరో మంత్రిపై ఈడీ నజర్.. పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.. (వీడియో)

తమిళనాడులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి‌పై ఈడీ దాడులు చేస్తోంది.

Enforcement Directorate raids Tamil Nadu Education Minister K Ponmudi ksm
Author
First Published Jul 17, 2023, 9:28 AM IST

చెన్నై: తమిళనాడులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. ఆయనను అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి‌పై ఈడీ దాడులు చేస్తోంది. మంత్రి పొన్ముడితో పాటు ఆయన కుమారుడైన లోక్‌సభ సభ్యుడు గౌతమ్‌ సిగమణికి సంబంధించి ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోమవారం సోదాలు  చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. 

చెన్నైలోని మంత్రి పొన్ముడి ఇంటితో పాటు తొమ్మిది చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విలుప్పురం జిల్లాలోని మంత్రి ఇల్లు, సూర్య ఇంజినీరింగ్ కళాశాలలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios