కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ను ఈడీ ప్రశ్నిస్తుంది. ఆయనను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు శుక్ర‌వారం ఆయ‌న నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ సంస్థ‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో అహ్మ‌ద్ ప‌టేల్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయడానికి అధికారులు ఢిల్లీలోని ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. 

ఇదే కేసులో గతంలో రెండుసార్లు అహ్మద్‌ పటేల్‌ను ప్ర‌శ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినప్పటికీ కరోనా వైరస్ కారణంగా కుదరలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో 65 సంవత్సరాల పైబడ్డ వారందరు ఇందులోనే ఉండమై ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆయనను ప్రశ్నిచడం కుదరలేదు. 

గుజరాత్ కి చెందిన స్టెర్లింగ్ బయోటెక్ కంపను ప్రోమోటర్లయిన చేతన్, నితిన్ సందేశరాల వేలకోట్ల బ్యాంకు ఫ్రాడ్ కి సంబంధించిన కేసులో అహ్మద్ పటేల్ ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. 

బ్యాంకులకు వేళా కోట్లు ఎగ్గొట్టిన ఈ సోదరులు భారతదేశాన్ని వీడి ఉండొచ్చని సిబిఐ తన చార్జిషీట్ లో పేర్కొంది. ఈ ఇద్దరు సోదరులు నైజీరియాలో ఉన్నట్టుగా ఈడీ వర్గాలు అనుమానిస్తున్నాయి. 

ఈ సంవత్సరం మార్చిలో కూడా అహ్మద్ పటేల్ ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్ధిక లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

హవాల రూపంలో డబ్బు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు చేరినట్టుగా ఐటీ శాఖ అనుమానిస్తోంది.హవాలా రూపంలో సుమారు రూ. 400 కోట్లు అహ్మద్ పటేల్ కు అందినట్టుగా  అధికారులు గుర్తించారు.

 ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు  ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. .