నోటీసులకు స్పందించని కేజ్రీవాల్‌.. లీగల్ యాక్షన్‌లోకి దిగిన ఈడీ, ఢిల్లీ సీఎంకు చిక్కులు తప్పవా..?

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది.

Enforcement Directorate moves court against Arvind Kejriwal for skipping summons in Delhi liquor policy case ksp

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది.

ఫిబ్రవరి 7న కోర్టు ఈ అంశాన్ని విచారించనుంది. ఇటీవల ఈడీ ఆయనకు ఐదోసారి నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించలేదు. గడిచిన నాలుగు నెలల్లో కేజ్రీవాల్ నాలుగు సమన్లను దాటవేశారు. ‘‘సమన్లు ఇచ్చినా అరవింద్ కేజ్రీవాల్ కనిపించడం లేదని, ఆయన ప్రభుత్వోద్యోగి’’ అని ఈడీ కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 

 

 

మరోవైపు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ స్కాంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లను తమ లీగల్ టీమ్ అధ్యయనం చేస్తోందని ఆప్ పేర్కొంది. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు :

మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 - 22 ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించిందని , ఇందుకోసం లంచాలు చెల్లించిన కొంతమంది డీలర్లకు ఇది అనుకూలంగా వుందని ఈడీ ఆరోపించింది. ఈ అభియోగాలను పలుమార్లు ఆప్ ఖండించింది. ఈ పాలసీని తర్వాత రద్దు చేయగా.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు సిఫారసు చేశారు. అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios