ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇవాళ సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ చార్జీషీట్ లో ముగ్గురిపై అభియోగాలు మోపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సప్లిమెంటరీ చార్జీషీట్ ను గురువారంనాడు ఈడీ దాఖలు చేసింది. ముగ్గురు నిందితుపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ, మాగుంట రాఘవ , రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పై అభియోగాలు మోపింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ . ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అరెస్ట్ చేసిన నిందితుల విచారణకు సంబంధించిన అంశాలను ఈ చార్జీషీట్ లో ఈడీ ప్రస్తావించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై గత ఏడాది నవంబర్ 26న తొలి చార్జీషీట్ ను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఈడీ రెండో చార్జీషీట్ ను దాఖలు చేసింది . రెండో చార్జీషీట్ లో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత పేర్లను ఈడీ చేర్చింది. తాజాగా సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ చార్జీషీట్ లో ముగ్గురి పేర్లను ఈడీ పేర్కొంది. అయితే ఈ చార్జీషీట్ ను ఈ నెల 14న స్వీకరించనున్నట్టుగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది
