Asad Ahmed Encounter:మతం పేరుతో ఎన్‌కౌంటర్లు నిర్వహిస్తున్నారని బిజెపిపై  AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. హర్యానాలో  ఇద్దరు ముస్లిం యువకులను కాల్చి చంపిన వారిని కూడా ఇలానే ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారా అని ప్రశ్నించారు. 

Asad Ahmed Encounter:ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు, మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కుమారుడు, అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మతం పేరుతో బీజేపీ ఎన్‌కౌంటర్‌లు నిర్వహిస్తుందనీ, ఇక కోర్టులు, న్యాయమూర్తులు దేనికి అని ప్రశ్నించారు. కోర్టులను మూసివేయండనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జునైద్, నసీర్‌లను చంపిన వారిని బీజేపీ వాళ్లు కాల్చిపారేస్తారా అని నిలాదీశారు. మతం పేరుతో జరుగుతున్న హత్యకాండ అని ఒవైసీ ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ ఇంకా మాట్లాడుతూ.. ఇది ఎన్‌కౌంటర్ కాదనీ, చట్టాన్ని తుంగలో తొక్కుతున్న.. బుల్లెట్లతో న్యాయం చేస్తామని తేల్చిచెప్పితే కోర్టులను మూసేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే.. తెలంగాణలోని నిజామాబాద్‌లో జరిగిన సభలో ఓవైసీ ప్రసంగిస్తూ.. హర్యానాలో జునైద్, నసీర్‌లను ఈ ఏడాది ఫిబ్రవరిలో గోసంరక్షకులు హత్య చేశారని ఆరోపించారు. హర్యానాలో ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది? ఇళ్లను బుల్డోజర్ చేయడం లేదా? బుల్లెట్లు కాల్చి ఎన్‌కౌంటర్లు చేయలేదా? జునైద్, నసీర్‌లను చంపిన వారిపై కాల్పులు జరుపుతారా? అని ప్రశ్నించారు. మతం పేరుతో ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారనీ, జునైద్‌, నసీర్‌ల హంతకులను మీరు అంతమొందించగలరా? అని నిలదీశారు. ఇప్పటి వరకు ఒకరిని కూడా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ గురువారం ఝాన్సీలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సహచరుడు గులామ్‌ను హతమార్చింది. ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితులు ఉన్నారు
ఈ ఎన్‌కౌంటర్‌లో ఫిబ్రవరి 24న ఉమేష్‌పాల్‌ను హతమార్చిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, ఆ తర్వాత మరణించారని ఆయన చెప్పారు. వారిని అసద్ అహ్మద్, గులాంలుగా గుర్తించారు. నిందితుల నుంచి అత్యాధునిక విదేశీ ఆయుధాలు, బుల్ డాగ్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై రాజకీయ స్పందనలు కూడా మొదలయ్యాయి.

అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నించారు. తప్పుడు ఎన్‌కౌంటర్లు చేస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీకి కోర్టుపై అస్సలు నమ్మకం లేదనీ, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లను కూడా క్షుణ్ణంగా విచారించి దోషులను వదిలిపెట్టకూడదనీ, ఏది ఒప్పో ఏది తప్పో నిర్ణయించే హక్కు శక్తికి లేదనీ, భాజపా సోదరభావానికి వ్యతిరేకమని అన్నారు.