Kulgam encounter: కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదాలను తుదముట్టించాయి. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు.

Encounter in Kulgam.. Five Lashkar-e-Taiba terrorists killed..ISR

జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చాయి. అలాగే భద్రతా దళాలు కీలక సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. కుల్గాం పోలీసులు, సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెట్టిందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

‘‘రెండో రోజు: ఐదుగురు ఉగ్రవాదులను కుల్గాం పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ మట్టుబెట్టాయి. కీలక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ చివరి దశలో ఉంది. సిబ్బంది ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు’’ అని జమ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.

గురువారం మధ్యాహ్నం కూడా కుల్గాం జిల్లాలోని డీహెచ్ పోరా ప్రాంతంలోని సామ్నో ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. నేహామా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గాలింపు చర్యలు ఎదురుకాల్పులుగా మారాయి. ఉగ్రవాదులు చిక్కుకున్న ప్రాంతం చుట్టూ భద్రతా దళాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా, రాత్రికి రాత్రే ఆపరేషన్ ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే తాజాగా ఎన్ కౌంటర్ రెండో రోజు కావడంతో ఉగ్రవాదులు పారిపోకుండా భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో బందోబస్తును కట్టుదిట్టం చేశాయి. కుల్గాంలోని నెహమాలోని సామ్నో ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios