సరిహద్దులను కాపాడుతూ దేశమాత సేవలో ప్రాణాలైనా త్యాగం చేస్తామని ప్రమాణం చేసిన సైనికుడు.. ఉగ్రవాదిగా మారడంతో సైన్యం అతనిని హతమార్చింది. 

సరిహద్దులను కాపాడుతూ దేశమాత సేవలో ప్రాణాలైనా త్యాగం చేస్తామని ప్రమాణం చేసిన సైనికుడు.. ఉగ్రవాదిగా మారడంతో సైన్యం అతనిని హతమార్చింది. జమ్మూకశ్మీర్‌ షోపియాన్‌లోని జైనాపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లుగా సమాచారం అందడంతో సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

ముష్కరులు కాల్పులు జరపడంతో.. సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. వారిని ఇద్రీస్ సుల్తాన్, అమీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఇద్రీస్ గతంలో జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు.

తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చి ఉగ్రవాదుల్లో చేరాడు. అతడిని ఛోటా అబ్రార్ అని స్థానికులు ముద్దుగా పిలుస్తారని సైన్యం తెలిపింది. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది.