Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

JammuKashmir: ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ జ‌మ్మూకాశ్మీర్ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘ‌ట‌న‌లు స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. 
 

Encounter in Jammu and Kashmir's Kupwara.. Two terrorists killed
Author
First Published Sep 25, 2022, 3:23 PM IST

2 Terrorists Killed In Jammu And Kashmir:  భారత సైన్యం-జమ్మూ కాశ్మీర్ పోలీసులకు మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని టెక్రినార్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. హతమైన ఈ గుర్తుతెలియని ఉగ్రవాదుల నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

"కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ టెక్రి నార్ సమీపంలో ఆర్మీ-కుప్వారా పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. వారి వ‌ద్ద నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది" అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

 

ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పించినందుకు కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఉన్న నివాస గృహాన్ని జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు ఆదివారం అటాచ్ చేశారు. "ప్రస్తుతం బందిపొరాలో ఉన్న వాన్‌పోరా గురేజ్‌కి చెందిన అబ్దుల్ సత్తార్ మీర్ కుమారుడు బషీర్ అహ్మద్ మీర్ అనే వ్యక్తి నివాస గృహాన్ని అధికారులు అటాచ్ చేయ‌డం జ‌రిగింది" అని పోలీసులు తెలిపారు. బందిపోరాలో వేర్వేరు ఉగ్రవాద నేరాలకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను ఆశ్ర‌యం క‌ల్పించిన‌ట్టు గుర్తించామ‌నీ, ఈ  ఇల్లు ఉగ్ర‌వాద కేసుతో ముడిపడి ఉందని పోలీసులు తెలిపారు. “ఈ ఇంటిని ఉగ్రవాదం, ఆశ్రయం, టెర్ర‌రిస్టుల‌కు ఆశ్రయం కల్పించడం కోసం ఉపయోగించారు. ఇక్క‌డి నుంచి పౌరుల‌పై దాడులు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు జ‌రిగిన‌ట్టు తెలిసింద‌ని పోలీసులు తెలిపారు. 

ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ జ‌మ్మూకాశ్మీర్ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘ‌ట‌న‌లు స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్ లను నిర్వహిస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. టెర్రరిస్టు కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. ప్రత్యేక డ్రోన్ లను ఉపయోగించి.. నిఘాను ఉంచుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios