తన పిరుదుల ఫోటోను బాస్ కు పంపిన ఉద్యోగి : సిక్ లీవ్ ఇలా కూడా అడుగుతారా!

అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు సిక్ లీవ్ తీసుకోవచ్చు. కానీ చాలా సంస్థలు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు అడుగుతుంటాయి. ఇలా అడిగిన  బాస్ కు ఓ ఉద్యోగి ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా? 

Employee sends photo of their buttocks after boss demands proof for sick leave AKP

ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితం యాంత్రికంగా మారిపోయింది...  ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఎలాంటి పరిస్థితులు ఎదురయినా పని చేయాల్సి వస్తుంది... చివరికి అనారోగ్యంతో బాధపడుతున్నా కనికరించని బాస్ లు వున్నారు. ఇలాంటి ఉన్నతోద్యోగుల కింద పనిచేస్తూ చాలామంది చిరుద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అలాంటి ఓ ఉద్యోగి తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 

తాను ఫైల్స్ తో బాధపడుతున్నానని చెప్పినా బాస్ నమ్మలేదని... దీంతో తన పిరుదులను ఫోటో తీసి పంపినట్లు సదరు ఉద్యోగి సోషల్ మీడియా వేదికన తెలిపాడు. తన అనారోగ్యం గురించి ఎంత చెప్పినా బాస్ నమ్మలేదని...దీంతో విసుగుచెంది ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా తన బాధ బాస్ కు అర్థమయితే మంచిదని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసాడు. 

అసలేం జరిగింది : 

తనకు ఎదురైన పరిస్థితి గురించి ఓ ఉద్యోగి రెడ్డిట్ ద్వారా బైటపెట్టాడు. తాను ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని... ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతూ సెలవు కావాలని మేనేజర్ ను కోరినట్లు తెలిపాడు. ఫైల్స్ కారణంగా తాను కనీసం కుదురుగా నిలబడలేని పరిస్థితి... ఇక కూర్చుని పనిచేయడం అస్సలు కుదరదు... అందువల్లే సిక్ లీవ్ కోరినట్లు తెలిపాడు. 

అయితే తన పరిస్థితిని మేనేజర్ ఏమాత్రం అర్థం చేసుకోలేదు... ఎంత చెప్పినా వినిపించుకోలేదని సదరు ఉద్యోగి వెల్లడించాడు. సిక్ లీవ్ కావాలంటే అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కోరడంతో సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొచ్చిందట. దీంతో టెస్ట్ రిపోర్ట్ గానీ, హాస్పిటల్ ఫైల్ ను గానీ పంపించలేదు... నేరుగా తన పిరుదులను ఫోటో తీసి బాస్ కు పంపించాడు. ఇలా తన ప్రస్టేషన్ ను తెలియజేసాడు సదరు ఉద్యోగి. 

ఇలా చేయడంద్వారా తాను కంపనీ నియమనిబంధనలను అతిక్రమించలేదని సదరు ఉద్యోగి చెబుతున్నాడు. ఆధారాలు అడిగినందుకే ఆ ఫోటో పంపాల్సి వచ్చిందన్నాడు. తాను ఏ తప్పు చేయలేదని... తన ఆరోగ్య పరిస్థితిని బాస్ కు తెలియజేసినట్లు చాలా ఈజీగా చెబుతున్నాడు ఉద్యోగి. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios