Asianet News TeluguAsianet News Telugu

ఏనుగులతో సెల్ఫీ కోసం వెళ్లి.. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని.. వీడియో వైరల్‌

ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏం జరిగిందో తెలియదు గానీ.. తిక్కరేగిన ఏనుగుల గుంపు వారిని ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పరుగు తీసేలా చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Elephants charge towards three men taking selfies in viral video from UP KRJ
Author
First Published Jul 6, 2023, 3:18 AM IST

లఖింపూర్ ఖేరీలోని దుధ్వా టైగర్ రిజర్వ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగుల గుంపు వారి వెంట పడి పరుగెత్తుతోంది. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కిందమీద పడుతూ  పరుగు పెట్టారు.

ఇందుకు సంబంధించిన ఓ క్లిప్‌ (@AhteshamFIN) అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. దాదాపు 50 ఏనుగుల గుంపు రోడ్డును ఆక్రమించిన పాలియా గౌరీఫాంట రహదారి దృశ్యం అని క్యాప్షన్ పేర్కొంది. అదే సమయంలో ముగ్గురు యువకులు ఏనుగుల దగ్గరికి వెళ్లి వాటితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఏనుగుల మందలోని కొందరు వాటిని పరుగెత్తేలా చేశారు.
 
10 సెకన్ల నిడివి గల వీడియోలో ముగ్గురు వ్యక్తులను కొన్ని ఏనుగులు వెంబడిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పరిగెత్తుతున్న క్రమంలో ఓ యువకుడు కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి పరుగు ప్రారంభించాడు. ఏనుగులు ముగ్గురు యువకులను వెంబడించగా, అక్కడికక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను కెమెరాలో బంధించాడు. అయితే, వైరల్ వీడియోను దుధ్వా టైగర్ రిజర్వ్ అధికారులు ధృవీకరించలేదు.

 
ఈ వీడియో ద్వారా అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏనుగులతో సెల్ఫీలు దిగడం అంటే ప్రాణాంతకం కావచ్చు. క్లిప్ చూసిన తర్వాత, ప్రజలు భిన్నమైన స్పందనలు ఇస్తున్నారు. ఒకరు తమాషాగా రాశారు. అడవి జంతువులను సమీపించే ప్రయత్నం చేస్తే అవి దాడి చేస్తాయని హెచ్చరిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అనవసర సాహసాలకు పోయి ఊహించని ప్రమాదాలు కొని తెచ్చుకున్న ఘటనలు జరుగుతుంటాయని కామెంట్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios