చనువిచ్చిందని చంకనెక్కెయత్నం: వ్యక్తిని తొండంతో విసిరికొట్టిన ఏనుగు

ఓ వ్యక్తిని తొండంతో ఏనుగు విసిరికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో  వైరల్ గా మారింది.

Elephant sends man flying after he gets too close to it lns

న్యూఢిల్లీ:  తన వద్దకు వచ్చిన వ్యక్తిపై ఓ ఏనుగు తొండంతో  విసిరికొట్టింది.  అయితే  ఈ ఘటనలో ఆ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. తొండాన్ని పట్టుకున్న వ్యక్తిని కొద్దిసేపు ఏం చేయని ఏనుగు ఆ తర్వాత విసిరికోట్టింది.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విక్రమ్ అనే నెటిజన్  ఇన్‌స్టాగ్రామ్  లో  ఈ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే  వేలాది మంది  వీక్షించారు. అంతేకాదు  వందలాది ఈ వీడియోను లైక్  చేశారు.

ఏనుగును మచ్చిక చేసుకొనేందుకు ఆ వ్యక్తి  ప్రయత్నించినట్టుగా వీడియోలో కన్పించింది.  కొన్ని ఆకుపచ్చ ఆకులను ఏనుగును అందించేందుకు ప్రయత్నించారు. ఏనుగు ఆ వ్యక్తి చేతిలోని ఆకుపచ్చ ఆకులను  తొండంతో తీసుకొని తింటుంది. దీంతో ఏనుగు తొండం పట్టుకొని ఆ వ్యక్తి నిమురుతుంటాడు. దీంతో కొద్దిసేపు సైలెంట్ గా ఉన్న ఏనుగు ఆ తర్వాత తన తొండంతో  ఆ వ్యక్తిని విసిరి కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు  పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.  అడవి జంతువులను ఒంటరిగా వదిలేయాలని సూచిస్తున్నారు.  జంతువుల ప్రవర్తనను అర్ధం చేసుకోవడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.  ఏనుగు తోక ఉపుతున్న సమయంలో దాని వద్దకు వెళ్లవద్దని మరొక నెటిజన్ సూచించారు.  తోక ఊపుతున్నఏనుగు వద్దకు వెళ్లొద్దు.. అది భయపడుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.జంతువులతో జాగ్రత్తగా ఉండాలని  మరొక నెటిజన్ సూచించారు. జంతువులకు కోపం తెప్పిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని మరొకరు వ్యాఖ్యానించారు.

 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  అడవులు అంతరించిపోతున్నాయి. దరిమిలా  జంతువులు  ఆహారం కోసం జనావాసాల వైపు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఏనుగులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూశాయి. తమిళనాడు కోయంబత్తూరుకు సమీపంలో  ఓ ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుండి  ఓ గ్రామం వద్దకు వచ్చింది. అయితే ఈ గుంపు నుండి  బయటకు వచ్చిన ఏనుగు  సమీపంలోని గ్రామానికి రావడంతో ప్రజలు  భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ ఏనుగును చివరికి  అటవీశాఖాధికారులు బంధించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios