మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా నుండి ఒక ఏనుగు బురదలో కూరుకుపోయిన ట్రక్కులను బయటకు తీస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ ఏనుగు మూడు ట్రక్కులను రోడ్డుపైకి నెట్టింది.

కొన్ని జంతువులు అప్పుడప్పుడు మనుషుల కంటే ఎక్కువ తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తాయి. ఆ వీడియోలను చూస్తే మనస్సుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఏనుగులు చేసే సరదా పనులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఏనుగు బురదలో కూరుకుపోయిన ట్రక్కులను బ‌య‌ట‌కు తీయడానికి త‌న వంతు సాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివ‌రాల్లోకెళ్తే.. కొందరు సిక్కు యువకుల క‌ళాకారుల బృందం.. పంజాబ్ లోని అమృత్‌సర్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తుతోంది. ఈ క్ర‌మంలో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కొలారస్‌లోని భటోవా గ్రామంలో రాత్రి బ‌స చేసింది. అయితే.. తమ బృందం వెళ్తున్న ట్రక్ ల‌ను ఒక రహదారి ప‌క్క‌న ఉన్న ఓ ఖాళీ ప్రాంతంలో పార్క్ చేయాల్సి వ‌చ్చింది. కానీ, రాత్రి ఆక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం కురిసింది. దీంతో వారు త‌మ వాహ‌నాలు నిలిపిన ప్రాంతం మొత్తం బురద మ‌యమైంది. దీంతో వారి లారీలు ఆ బురదలో కూరుకుపోయాయి.

ఆ లారీల్లో హేవీ లోడ్ చూడ‌టంతో మట్టిలో ఇరుక్కున్నాయి. ఆ వాహనాల‌ను బుర‌ద నుంచి బ‌య‌ట‌కు తీయ‌డానికి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. అసలూ వాహ‌నాలు బ‌య‌ట‌కు వస్తాయా? లేదా ? స‌మ‌యంలో... నేను ఉన్న‌నంటూ.. ఓ గ‌జ‌రాజు రంగంలోకి దిగింది. ఆ ఏనుగు త‌న శ‌క్తిని ఉప‌యోగించి.. ఆ ట్రక్కులు బురద నుంచి బ‌య‌ట‌కు తీసుక వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే జాతరలో పాల్గొనే.. సిక్కు క‌ళాకారుల బృందం అమృత్‌సర్ నుంచి నాందేడ్ కు వెళ్తుంది. వారితో ఏనుగులు, గుర్రాలను కూడా తీసుకెళ్తున్నారు. ఈ జంతువులు కూడా త‌మ ట్రూప్ లో భాగ‌మ‌ని, ఈ ఏనుగు మనుషుల్లాగే తెలివైన‌వీ, ఏ పని అయినా.. సుల‌భంగా చేస్తున్నాయ‌ని ఈ బృందం సభ్యులు చెప్పారు. గ‌తంలో కూడా ప‌లుసార్లు ఇరుక్కుపోయిన వాహనాల్లోకి బయటకు తీయడంలో సహాయం చేసిందని సిక్కు బృందం సభ్యులు చెప్పారు.

Scroll to load tweet…