Maharashtra: మ‌హ‌రాష్ట‌లో విద్యుత్ బిల్లులు చెల్లించ‌ని వినియోగదారుల‌పై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌కాలంలో బిల్లులు చెల్లించ‌క‌పోతే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆపేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

Maharashtra: మ‌హ‌రాష్ట‌లో విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారుల‌పై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ మండిపడ్డారు. స‌కాలంలో బిల్లులు చెల్లించ‌క‌పోతే.. వారి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని బెదిరించారు. అధిక విద్యుత్ బిల్లుల ఆరోపణలపై వేదనతో, లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ ఉద్యోగులు కోవిడ్ లాక్‌డౌన్‌ల సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. ఇలా విద్యుత్ అందించిన చాలా మంది సమయానికి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు.

అకోలాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నితిన్ రౌత్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ స‌మ‌యంలో మీరు(ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి) హాయిగా ఇండ్ల‌లో కూర్చొంటే విద్యుత్ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి పని చేస్తూ.. విద్యుత్ అధికారులు నిరాంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫరా చేశామ‌ని అన్నారు. ఫ్రీజ్‌లు, కూల‌ర్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వినియోగించేందుకు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశామ‌న్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో కొంత మంది ఉద్యోగులు త‌మ ప్రాణాల‌ను కూడా కోల్పోయార‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా బిల్లులు చెల్లించి, విద్యుత్ ఉద్యోగుల‌ను ఆదుకోవాల‌న్నారు.

 ఇది చేయండి.. అది చేయండని అన‌డ‌మే త‌ప్ప‌.. విద్యుత్ బిల్లులు చెల్లించరు. స‌కాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించని వారి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాం. విద్యుత్ ఉచితం కాదు డిఫాల్టర్లను క్షమించం. అని అన్నారు. కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని ఆ రాష్ట్రంలోని రైతులు నిరసిస్తున్నారు. కరెంటు బిల్లుల్లో కూడా తేడాలున్నాయని, వాటిని సరిచేస్తే సగానికిపైగా తగ్గుతుందని పేర్కొన్నారు.