Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ కట్... అంధకారంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై

టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగా ముంబై మహానగరం అందకారంగా మారింది. 

Electric supply in Mumbai interrupted
Author
Mumbai, First Published Oct 12, 2020, 11:01 AM IST

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై మహానగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. పవర్ గ్రిడ్ లో ఏర్పడిన సాంకేతిక తప్పిదాల వల్లే నగరానికి పవర్ సప్లయ్ నిలిచిపోయిందని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై  మరియు ట్రాన్స్ పోర్ట్ ఓ ప్రకటన చేసింది. టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. 

పవర్ సప్లై నిలిచిపోవడంతో ముంబైవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కార్పోరేట్ సంస్థలు సహా భారీ, చిన్న పరిశ్రమలతో పాటు సామాన్యులు, వీఐపిలకు ఈ పవర్ కట్ సెగ తాకింది. వెంటనే అధికారులు నగరంలో కరెంట్ సప్లైని పునరుద్దరించాలని ముంబై వాసులు కోరుతున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios