ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ వైట్ కాలర్ అవినీతి - ఎంకే స్టాలిన్
తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టిన తరువాత బీజేపీ ఆ పదాన్నే వాడటం లేదని అన్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ వైట్ కాలర్ అవినీతిగా అభివర్ణించారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కేంద్రంలో లౌకిక, సమాఖ్య, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో స్టాలిన్ ప్రసంగించారు.
సిద్దూ మూస్ వాలాకు సోదరుడొచ్చాడు.. మగబిడ్డకు స్వాగతం పలికిన తల్లిదండ్రులు..
‘‘గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చేసింది రెండే రెండు పనులు - విదేశీ పర్యటనలు, ఫేక్ ప్రచారం. దీన్ని మనం ఆపాలి’’ అని అన్నారు. ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసినప్పటి నుంచి బీజేపీ 'ఇండియా' అనే పదాన్ని వాడటం మానేసిందని అన్నారు.
మా జెండాలు వేరు కావచ్చు.. మా ఎజెండా ఒక్కటే - చంద్రబాబు నాయుడు
‘‘ఇది భయం. ప్రధాని మోడీ మమ్మల్ని అవినీతిపరులుగా అపఖ్యాతి పాలు చేయడం ప్రారంభించారు, కానీ ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ అవినీతిపరులని నిరూపించాయి. ఇది బీజేపీ వైట్ కాలర్ అవినీతి’’ అని స్టాలిన్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారతదేశ హృదయాన్ని చూసే ప్రయత్నమని అన్నారు.
బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
భారత్ కు బీజేపీ కంటే పెద్ద ముప్పు మరొకటి లేదని ఎంకే స్టాలిన్ అన్నారు. అందుకే ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. భారత్ జోడ్ న్యాయ్ యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కన్యాకుమారిలో మొదలైన ప్రయాణం ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ముగియాలని ఆకాంక్షించారు.
ప్రజాగళం సభలో టవర్లపైకి ఎక్కిన అభిమానులు.. దిగిపోవాలని కోరిన ప్రధాని మోడీ
అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడేందుకు ఇండియా భాగస్వామ్య పక్షాలు ఏకమయ్యాయని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..'జైలుకు వెళ్లడానికి భయపడం కాబట్టే తామంతా కలిసి ఉన్నామని, గెలవాలంటే పోరాడాలని అన్నారు.