Asianet News TeluguAsianet News Telugu

మా జెండాలు వేరు కావచ్చు.. మా ఎజెండా ఒక్కటే - చంద్రబాబు నాయుడు

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు.

Our flags may be different. Our agenda is the same: Chandrababu Naidu..ISR
Author
First Published Mar 17, 2024, 6:05 PM IST

తమ మూడు పార్టీల జెండాలు వేరైనా, ఎజెండాలు ఒకటే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లాలోని చిలకూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అని అన్నారు. సంక్షేమం, అభివృద్దే ఎన్డీఏ కూటమి లక్ష్యం అని అన్నారు.

మోడీ ఒక వ్యక్తి కాదని, భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అని అన్నారు. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని అన్నారు. కూటమికి ప్రధాని మోడీ అండ ఉందని చెప్పారు. 5 కోట్ల ఏపీ ప్రజల తరుఫున ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. 

‘‘ప్రధాన మంత్రి అన్నా యోజన, అవాజ్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. సంక్షేమం అందిస్తూనే భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, పీఎం గతి శక్తి, భారత్ మాల ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్ట్ లతో సంపద సృష్టించారు, డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు’’ అని కొనియాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios