జూన్  19న రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో  ఖాళీ అవుతున్న 18 స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 37 మంది అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.