Asianet News TeluguAsianet News Telugu

గంభీర్ కి రెండు ఓట్లు.. కేసు పెట్టిన ఆప్ నేత


మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయనకు రెండు ఓట్లు ఉన్నాయంటూ ఆప్ నేత ఆతిషి ఆరోపించారు.

Elections 2019: Gautam Gambhir Has 2 Voter IDs, Says AAP Rival Atishi, Files Complaint
Author
Hyderabad, First Published Apr 26, 2019, 3:00 PM IST

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయనకు రెండు ఓట్లు ఉన్నాయంటూ ఆప్ నేత ఆతిషి ఆరోపించారు.

గంభీర్.. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే.. ఆయనకు ఓకే పట్టణంలో రెండు ఓట్లు ఉన్నాయని ఆప్ నేత ఆరోపించారు. ఈ విషయంలో.. గంభీర్ పై కేసు కూడా పెట్టారు.

ఢిల్లీ కరోల్ భాగ్, రాజిందర్ నగర్ రెండు చోట్లు ఓట్లు ఉన్నాయని.. ఆ రెండు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం కిందకు వస్తాయని ఆప్ నేతలు పేర్కొన్నారు. గంభీర్ అపరాద్ పేరిట హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మరీ... సెక్షన్ 17, సెక్షన్ 31 కింద గంభీర్ నేరం చేశారని.. సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఆరోపణలపై గంభీర్ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా.. ఇటీవల గంభీర్ నామినేషన్ వేసిన సమయంలో కూడా.. అది సరిగాలేదని.. దానిని రిజెక్ట్ చేయాలంటూ.. కాంగ్రెస్, ఆప్ నేతలు ఈసీపై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios