సామాన్యుల బ్యాగులకు కన్నాలు వేయడం బోర్ కొట్టిందో ఏమో కొందరు దొంగలు ఏకంగా వీఐపీ బ్యాగును కొట్టేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ తస్కరణకు గురైంది

సామాన్యుల బ్యాగులకు కన్నాలు వేయడం బోర్ కొట్టిందో ఏమో కొందరు దొంగలు ఏకంగా వీఐపీ బ్యాగును కొట్టేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ తస్కరణకు గురైంది.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ బృందం ఇవాళ జైపూర్ వెళ్లింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ సహా ముగ్గురు కమిషనర్లు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సునీల్ బ్యాగ్ చోరీకి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.