ఆ విషయంపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అంతకు ముందు ఎన్నికల సంఘం ఎలాంటి ఎగ్జిట్ పోల్‌ను నిషేధించింది. 

Election Commission Says No Exit Polls Till November 30 KRJ

దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాలలో నవంబర్ 7 నుండి నవంబర్ 30 వరకు వివిధ దశలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి.ఇప్పటికీ ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే ఈ ఎన్నికల అనుప్రభాతం చేస్తూ.. తరచూ పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నాయనే వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్  ఎగ్జిట్ పోల్స్ దృష్టి సారించింది. వాటిపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుండి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీచేసింది. 

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ లేదా సర్వేలను నిర్వహించకూడదని హెచ్చరించింది. అలాగే అసత్య ప్రచారాలను చేయకూడదని ఈసీ పునరుద్ఘాటించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన లేదా అతిక్రమించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చట్ట ప్రకారం వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా కొన్ని సందర్భాల్లో రెండో విధించవచ్చని హెచ్చరించింది. 

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఛత్తీస్ ఘడ్ లో రెండు దశలలో (నవంబర్ 7, 17 తేదీలలో) పోలింగ్ జరగనుంది. అలాగే మిజోరంలో నవంబర్ 7న,  మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 25న తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల పూర్తి అయిన తర్వాత నవంబర్ 30న సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడలున్నాయి.

రాజస్థాన్ మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ లలో ప్రధానంగా కాంగ్రెస్ బిజెపిల మధ్య ద్విముఖ పోరు జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం బి ఆర్ ఎస్, కాంగ్రెస్ బిజెపిల మధ్య త్రిముఖ పోరు జరగనున్నది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios