Asianet News TeluguAsianet News Telugu

తొందరపాటు లేదు: వయనాడ్ ఉప ఎన్నికలపై ఎన్నికల సంఘం

కర్ణాటక ఎన్నికల తేదీలు ముగియడంతో అందరి దృష్టి హాట్ సీట్ - వాయనాడ్‌పై పడింది. ఇప్పుడు అనర్హత వేటు పడిన ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభకు చేరుకున్నారు.  పంజాబ్‌లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మేఘాలయలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఖాళీల భర్తీకి ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే 

Election Commission on bypolls in Rahul Gandhi's Wayanad seat
Author
First Published Mar 30, 2023, 12:49 AM IST

పరువు నష్టం కేసులో దోషిగా తేలిన వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే..ఈ క్రమంలో పంజాబ్‌లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మేఘాలయలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఖాళీల భర్తీకి ఉప ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల తేదీని  ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని పలువురు భావించారు. కానీ, అంచనాలను తారుమారు చేస్తూ..  ఉపఎన్నికల తేదీల ప్రకటనలో తొందరపడాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకారం.. ఎంపిక చేసిన స్థానాలకు మే 10న ఉప ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో కూడా మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.  అయితే, రాహుల్ గాంధీ దిగువ సభకు అనర్హత వేటు వేయడంతో వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించలేదు. వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం తొందరపడడం లేదని సీఈసీ బుధవారం తెలిపింది. 2019 పరువు నష్టం కేసులో న్యాయపరమైన పరిష్కారాలను కోరేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 30 రోజుల గడువు ఉంది. సూరత్‌లోని దిగువ కోర్టు న్యాయపరమైన పరిష్కారానికి రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఇచ్చిందని సీఈసీ తెలిపింది. తొందరపాటు లేదు, వేచి చూస్తాం’ అన్నాడు.


ఆరు నెలల్లో ఉప ఎన్నికలు !

వయనాడ్‌లో ఖాళీగా ఉన్న స్థానానికి ఈ ఏడాది మార్చి 23న నోటిఫై చేశామని, చట్ట ప్రకారం ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని సీఈసీ పేర్కొంది. నిబంధనలను ఉటంకిస్తూ, మిగిలిన పదవీకాలం ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటే, ఎన్నికలు నిర్వహించబడవని చెప్పారు. వాయనాడ్ విషయానికి వస్తే.. మిగిలిన కాలం ఒక సంవత్సరం కంటే ఎక్కువ.

పంజాబ్‌లోని జలంధర్ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఝర్సుగూడ (ఒడిశా), చన్బే , సువార్ (ఉత్తరప్రదేశ్), సోహియాంగ్ (మేఘాలయ) అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఏప్రిల్ 20 వరకు కొనసాగనుండగా, ఏప్రిల్ 21న పరిశీలన జరగనుంది. ఉప ఎన్నికకు సంబంధించి ఏప్రిల్ 24 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios