రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓటర్లు పాల్గొనేలా ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను ఇండియాన్ ఐకాన్‌గా ఎన్నికల సంఘం బుధవారం నామినేట్ చేయనుంది. ఢిల్లీలో టెండూల్కర్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం.. టెండూల్కర్ ఓటర్లలో అవగాహన కల్పించడానికి కృషి చేయనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ మంది ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) "నేషనల్ ఐకాన్"గా పేర్కొననున్నారు. బుధవారం ఢిల్లీలో టెండూల్కర్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదుర్చుకోనుంది. మూడేళ్ల ఒప్పందం ప్రకారం టెండూల్కర్ ఓటర్లలో అవగాహన కల్పించనున్నారు.
ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాటు చేస్తోంది. వీలైనంత వరకు ఓటర్లలను ప్రలోభాలకు గురికాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు యువతలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ప్రభావాన్ని పెంచేందుకు ఈ సహకారం ఒక ముందడుగు అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ భాగస్వామ్యం ద్వారా.. ఓటింగ్ పట్ల పట్టణ , యువత సవాళ్లను పరిష్కరించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఎన్నికల సంఘం వివిధ రంగాలకు చెందిన ప్రముఖ భారతీయులను 'నేషనల్ ఐకాన్'గా పేర్కొంటుంది. గత సంవత్సరం కమిషన్ నటుడు పంకజ్ త్రిపాఠిని నేషనల్ ఐకాన్ గా గుర్తించింది. అంతకుముందు.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్ , మేరీకోమ్ వంటి సెలబ్రెటీలను ఎన్నికల కమిషన్ నేషనల్ ఐకాన్ గా గుర్తించింది. ఇప్పుడు ఈసారి ఈ బాధ్యతను భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు అప్పగించింది.
