Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు: సయ్యద్‌పై ఈసీ ఫైర్

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిందంటూ సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది

Election commission complaint on syed shuja
Author
New Delhi, First Published Jan 23, 2019, 8:09 AM IST

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిందంటూ సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

షుజా చేసిన ప్రకటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. లండన్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్కైప్ ద్వారా పాల్గొన్న సయ్యద్ షుజా... 2014లో భారత ఎన్నికల సంఘం వాడిన ఈవీఎంలను అభివృద్ది చేసిన ఈసీఐఎల్ బృందంలో తాను కూడా సభ్యుడినన్నారు.

2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని.. ఈవీఎంలను హ్యాక్ చేసి తమ బృందం రుజువు చేసి చూపించిందంటూ ఆయన ప్రకటించడం భారతదేశ రాజకీయాల్లో దుమారానికి కారణమైంది. వెంటనే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios