Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర రాజకీయంలో ఊహించని ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే.

మహారాష్ట్ర రాజకీయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Eknath Shinde to be the Maharashtra Chief Minister says Devendra Fadnavis
Author
First Published Jun 30, 2022, 4:43 PM IST

మహారాష్ట్ర రాజకీయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక, సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో దాదాపు వారం రోజులు సాగిన రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాయి. 

ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసిన ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని తెలియజేశారు. అనంతరం దేవేంద్ర ఫెడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దెవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘2019లో  శివసేన పొత్తు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో మాకు అవసరమైన సంఖ్యాబలం వచ్చింది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాము. అయితే బాలాసాహెబ్ జీవితాంతం ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారో వారితో పొత్తు పెట్టుకోవాలని శివసేన నిర్ణయం తీసుకుంది. హిందుత్వ, సావర్కర్‌కు వ్యతిరేకంగా ఉన్న వారితో శివసేన కూటమిని ఏర్పాటు చేసింది. ప్రజల ఆదేశాన్ని శివసేన అవమానించింది’’ అని అన్నారు.

‘‘కాంగ్రెస్, ఎన్‌సీపీలతో పొత్తును ముగించాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే వారి అభిప్రాయాలను విస్మరించారు. మహా వికాస్ అఘాడి కూటమి భాగస్వాములకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈ ఎమ్మెల్యేలు వారి నిరసనను తీవ్రతరం చేశారు’’ అని ఫడ్నవీస్ చెప్పారు. 

అయితే ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఫడ్నవీస్ చెప్పారు. ఈరోజు మంత్రులు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయబోరని చెప్పారు. ఈ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉంటుందని చెప్పారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని ఫడ్నవీస్ వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios