Asianet News TeluguAsianet News Telugu

రాజ్ థాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.. మహారాజకీయాల్లో కొత్త ట్విస్ట్...

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడీ సంభాషణ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Eknath Shinde speaks to MNS chief Raj Thackeray
Author
Hyderabad, First Published Jun 27, 2022, 12:53 PM IST

మహారాష్ట్ర : మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి.  పొలిటికల్ ఇష్యూ చివరకు Supreme Courtకు చేరింది. Uddhav Thackeray వర్గం, Shiv Sena తిరుగుబాటు టీం ఏక్నాథ్ షిండేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

కాగా..  Maharashtra Politics లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) అధినేత Raj Thackeray తెరమీదకు వచ్చారు.  సోమవారం ఉదయం రాజ్ థాకరేకు ఏక్ నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే… రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే గతవారం తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుదిపేసింది. షిండే తన మద్దతుదారులతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. శివసేన పార్టీ రంగంలోకి దిగింది. షిండేను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో ఈ పరిణామాలపై పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి అని, త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని గతవారం అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని విశ్వాసం వ్యక్తం చేశారు.

మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం: కోర్టుకు వెళ్లే యోచనలో ఏక్‌నాథ్ షిండే వర్గం

‘గత సోమవారం రాత్రి శాసనమండలి ఎన్నికల తర్వాత నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో లేరు అనేది నిజమే. ఏక్ నాథ్  షిండే మంగళవారం ముంబైలో లేరు. అయితే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం.  కొంతమంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతున్నాను. త్వరలోనే మా ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు. షిండేను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ఆయన పార్టీకి నమ్మకమైన నేత. బాలా సాహెబ్ సైనికుడు’  అని రౌత్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ పై రౌత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలలో కొంతమంది తిరిగి రావాలని కోరుకుంటున్నారని అయితే వారిని బలవంతంగా అక్కడ నిర్బంధించారని ఆరోపించారు.

అయితే, పరిస్థితులు మారిపోయాయి. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దీంతో శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా మాటల యుద్ధం మొదలయ్యింది. ఏక్ నాథ్ షిండేను శివసేన పార్టీ శాసనసభ పక్షనేతగా తొలగించారు. దీంతో ఆయన ముంబై కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios