Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ లో ప్రశాంతంగా ఈద్ వేడుకలు

శ్రీనగర్ లో ఇప్పటికే సెక్షన్ 144ను తొలగించినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా ఫోన్ లైన్లు కూడా యథావిధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసలు జరగకుండా ఈద్ పండగను జరుపుకున్నారని అధికారులు చెప్పారు.

Eid al-Adha prayers concluded in Kashmir without any violence: Police
Author
Hyderabad, First Published Aug 12, 2019, 4:09 PM IST


దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ వేడుకలు ఘనంగా, ఆనందంగా జరుపుకున్నారు. కాగా... కాశ్మీర్ లో కూడా ఈద్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయని అక్కడి అధికారులు తెలిపారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పండ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. కాశ్మీర్ వ్యాలీ గుంపులు గుంపులుగా ఎవరూ లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

శ్రీనగర్ లో ఇప్పటికే సెక్షన్ 144ను తొలగించినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా ఫోన్ లైన్లు కూడా యథావిధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసలు జరగకుండా ఈద్ పండగను జరుపుకున్నారని అధికారులు చెప్పారు.

ఆదివారం సాయంత్రం నుంచే ఈద్ కోసం పొరుగున ఉన్న మసీదులలో ప్రార్థనలు చేయడానికి కాశ్మీరులను అనుమతించినట్లు అధికారులు చెప్పారు. కాశ్మీర్ లోయ అంతటా వేలాది మసీదులలో ఈద్-ఉల్-అదా ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యారని... చుట్టు అంతా ప్రశాంతంగా ఉందని సంబంధిత అధికారి ఒకరు ట్వీట్ చేశారు. స్థానిక ప్రజలందరికీ అధికారులు మిఠాయిలు పంచిపెట్టారు.

ఇదిలా ఉండగా... ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం వరకు అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios