Asianet News TeluguAsianet News Telugu

నీరవ్‌మోడీ, విజయ్ మాల్యా, చోక్సీలకు ఈడీ షాక్: సీజ్ చేసిన ఆస్తుల నుండి రూ. 9 వేలు బ్యాంకులకు బదిలీ

 బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో తలదాచుకొంటున్న ముగ్గురు ప్రముఖుల సీజ్ చేసిన ఆస్తుల నుండి రూ. 9 వేల కోట్లను  బ్యాంకులకు ఈడీ బదిలీ చేసింది

ED transfers Rs 9,000 crore of Rs 18,000 crore assets seized from Nirav Modi, Mallya and Choksi to banks lns
Author
New Delhi, First Published Jun 23, 2021, 2:45 PM IST

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో తలదాచుకొంటున్న ముగ్గురు ప్రముఖుల సీజ్ చేసిన ఆస్తుల నుండి రూ. 9 వేల కోట్లను  బ్యాంకులకు ఈడీ ఈడీ బదిలీ చేసింది వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా లకు సంబంధించిన ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకొంది. బ్యాంకులు ఎదుర్కొంటున్న మొత్తం నష్టాల్లో 80 శాతం అయిన రూ. 18,750 కోట్ల విలువైన ఆస్తులను  ఈడీ సీజ్ చేసింది. సగం ఆస్తులను బ్యాంకులు, కేంద్రానికి బదిలీ చేసింది. 

ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ. 9,371.17 కోట్ల విలువైన వాటాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్టుగా ఈడీ బుధవారం నాడు ప్రకటించింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు మోసం చేసిన మొత్తం రూ. 22,585.83 కోట్లు. వీటిో రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ఇవాళ్టికి రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకు బదిలీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 25న మరో రూ. 800 కోట్లను బదిలీ చేయాల్సి ఉంది. ఈ నెల 25 నాటికి షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 800 కోట్లు సంపాదించవచ్చని కూడ ఈడీ తెలిపింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios