ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఈడీ సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న విచారణకు రావాలని Enforcement Directorate కాంగ్రెస్ పార్టీ చీఫ్ Sonia Gandhi కి సోమవారం నాడు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని గతంలోనే సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాలతో తనకు నాలుగు వారాల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించిన విషయాన్ని సోనియా గాంధీ ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ నెల 22వ తేదీ వరకు సోనియాగాంధీకి ఇచ్చిన గడువు తీరనుంది. దీంతో ఈ నెల 21న విచారణకు రావాలని ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు.
ఈ ఏడాది జూన్ మాసంలో తనకు ఇచ్చిన సమన్లను వాయిదా వేయాలని సోనియాగాంధీ రాతపూర్వకంగా ఈడీ అధికారులను అభ్యర్ధించింది. దీంతో ఈడీ అధికారులు సోనియా అభ్యర్ధనను అంగీకరించారు. కరోనా కారణంగా తనకు వచ్చిన ఊపిరితిత్తుల ఇణ్‌ఫెక్షన్ నుండి కోలుకొనే వరకు తన విచారణను వాయిదా వేయాలని సోనియాగాంధీ ఈడీ అధికారులను ఆ లేఖలో కోరారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఈ ఏడాది జూన్ 18న న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 12న ఆమె కరోనాతో గంగారాం ఆసుపత్రిలో చేరారు.
National Herald లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ విచారణకు రావాలని ఈ ఏడాది జూన్ 8న సమన్లు పంపారు. జూన్ 1న ఆమెకు కరోనా సోకింది.
సోనియా గాంధీ, Rahul Gandhi లు, వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ Subramanian Swamy ఢీల్లీ హైకోర్టులో కేసు వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చాయి. రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవెట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఏజేఎల్ లో వాటా దక్కించుకున్న సమయంలో తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని మాజీ న్యాయ మంత్రి శాంతి భూషన్, అలహాబాద్ , మద్రాస్ హైకోర్టులలో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జస్టిస్ మార్కండేయ కట్జూతో సహా అనేక మంది ఏజేఎల్ షేర్ హోల్డర్లు పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ తో సహా ఏజేఎల్ ఆస్తులను వైఐఎల్ సంస్థ రూ. 2 000 కోట్లపైగా ఆస్తులను అక్రమంగా తీసుకుందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్ కు బకాయిపడిన రూ. 90.25 కోట్లకు గాను వైఐఎల్ కేవలం రూ. 50 లక్షలను మాత్రమే చెల్లించిందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. వార్తా పత్రికను స్థాపించేందుకు పార్టీ నిధుల నుండి రుణం తీసుకోవడం కూడా చట్టవిరుద్దమని కూడా సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. 2014లో ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది., మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
ఈ కేసులో రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.
