ఈ నెల 2వ తేదీన విచారణకు రావాలని  ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు రావాలని కోరింది. 

న్యూఢిల్లీ:National Herald case, కేసులో ఎఐసీసీ చీఫ్ Sonia gandhi ఆ పార్టీ అగ్రనేత Rahul Gandhi లను విచారణకు రావాలని బుధవారం నాడు Enforement Directorate సమన్లు జారీ చేసింది. 

రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నేషనల్ హెరాల్డ్ కు స్వాతంత్ర్యం రోజుల నాటి నుండి చరిత్ర ఉందని కాంగ్రెస్ నేత, సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. మమత బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లాపై కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగించిందని ఆయన ఆరోపించారు.

2015లోనే నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ మూసివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం నచ్చని ప్రభుత్వం గతంలో ఈ కేసును విచారించిన అధికారులను తొలగించి కొత్త వారిని నియమించి ఈ కేసును తెరమీదికి తీసుకొచ్చిందన్నారు.దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఈ కేసును తెరమీదికి తెచ్చిందని ఆయన విమర్శించారు.

2013లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదుపై విచారణ జరిగింది. కాంగ్రెస్ నేతలపై ఐటీ దర్యాప్తు జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలపై సుబ్రమణ్యస్వామి ఆరోపణలు చేశారు. పన్ను ఎగవేతలకు కూడా పాల్పడ్డారని సుబ్రమణ్యస్వామిపై సోనియా, రాహుల్ లపై పిర్యాదు చేశారు. 

సోనియాగాంధీ, రాహల్ గాంధీ తదితరులు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని పొందారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ .90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కు పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రమణ్యస్వామి అప్పట్లో ఆరోపించారు.ఈ విషయమై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సుబ్రమణ్యస్వామి కేసు దాఖలు చేశారు. ఈ పిర్యాదుపై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే ఇటీవలనే మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సాల్ లను ప్రశ్నించిన విషయం తెలిసిందే.