ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు ఆ పార్టీ నేత జయంత్ పాటిల్ కు ఈడీ అధికారులు గురువారంనాడు నోటీసులు పంపారు. జయంత్ పాటిల్ ఎన్‌సీపీ మహరాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రేపు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఐఎల్, ఎఫ్ఎస్ స్కాంలో జయంత్ పాటిల్ పై ఆరోపణలున్నాయి. దీంతో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. కోహినూర్ నిర్మాణానికి ఇచ్చిన రుణాలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ థాకరేను కూడా ఈడీ ప్రశ్నించింది.
