Enforcement Directorate: గతేడాది డిసెంబర్‌లో షియోమీ, ఇతర చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ క్రమంలోనే కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. తాజాగా షియోమీకి షాకిచ్చిన ఈడీ.. రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది.
Xiaomi India: షియోమీ ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో షియోమీ, ఇతర చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ క్రమంలోనే కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. విదేశీ మారకంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కేసులో ఈడీ చర్యలకు దిగింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ ఇండియాకు చెందిన రూ. 5,551.27 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. చెల్లింపులకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే చర్యలు తీసుకుంది.
"ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999 నిబంధనల ప్రకారం కంపెనీ చేసిన అక్రమ బాహ్య చెల్లింపులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.5551.27 కోట్ల M/s Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది" అని Enforcement Directorate ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో, కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్‌ను ఈ కేసులో ప్రశ్నించడానికి Enforcement Directorate పిలిచింది. బెంగళూరులోని ఓ దర్యాప్తు అధికారి అతడిని ప్రశ్నించారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మూడో కంపెనీ ద్వారా చైనాకు చేసిన విదేశీ రెమిటెన్స్‌లకు సంబంధించి ఈ కేసు నడుస్తోంది. ఫెమాను ఉల్లంఘించి దాదాపు రూ. 3,000 కోట్లను చైనాకు పంపినట్లు Enforcement Directorate అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇదే విషయమై కంపెనీపై కేసు నమోదైంది. షేర్‌హోల్డింగ్, ఫండ్ సోర్సెస్, వెండర్ కాంట్రాక్ట్‌లు మరియు విదేశాల్లో చేసిన చెల్లింపులతో సహా కంపెనీకి సంబంధించిన ఆర్థిక పత్రాలను అందించాలని జైన్‌ని కోరినట్లు సమాచారం.
కాగా, Xiaomi అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమది చట్టాన్ని గౌరవించే కంపెనీ అని చెప్పారు. "మేము దేశ చట్టాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తాము. మేము అన్ని నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము. అదే విధంగా నమ్మకంగా ఉన్నాము. అవసరమైన అన్ని సమాచారాన్ని కలిగి ఉండేలా వారి కొనసాగుతున్న విచారణతో మేము అధికారులతో సహకరిస్తున్నాము" అని తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో షియోమీ, ఇతర చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. భారతదేశం మరియు చైనా సైన్యాల మధ్య లడఖ్ ముఖాముఖి ప్రారంభమైనప్పటి నుండి, TikTok మరియు కొన్ని Xiaomi యాజమాన్యంలోని అనేక చైనీస్ అప్లికేషన్‌లను కేంద్రం నిషేధించింది. కాగా, ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో Xiaomi మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
