చైనా మొబైల్ సంస్థ వివో, దాని ఇతర అనుబంధ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దేశవ్యాప్తంగా 44 చోట్ల తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ ఈ రైడ్లు నిర్వహించింది. కాగా, సదరు కంపెనీలు ఇంకా స్పందించాల్సి ఉన్నది.
న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ వివో, దాని ఇతర అనుబంధ సంస్థలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్లు చేసింది. మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. అయితే, కంపెనీల నుంచి ఇప్పటికైతే ఇంకా స్పందన రాలేదు.
గతేడాది డిసెంబర్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా వివో, ఇతర చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ వంటి సంస్థలపై తనిఖీలు చేసింది. సుమారు 20 ప్రాంతాల్లో రైడ్లు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ చైనా మొబైల్ కంపెనీలు పన్నులు ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఆదాయ పన్ను శాఖ ఈ తనిఖీలు చేసినట్టు కొన్ని వర్గాలు అప్పుడు తెలిపాయి. తక్కువ రాబడి ఉంటున్నదని, నష్టాల్లో ఉన్నామని చెబుతూ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖకు సంకేతాలు వచ్చినట్టు వివరించాయి.
షావోమీ ఇండియా హెడ్ మను జైన్‌ను సెంట్రల్ ఏజెన్సీ విచారించింది కూడా. ఫారీన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద మను జైన్‌ను ప్రశ్నించింది. అంతేకాదు, షావోమీ సంస్థకు చెందిన రూ. 5000 కోట్ల బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ అటాచ్ చేసుకుంది.
అంతేకాదు, గతేడాది ఆగస్టులో చైనా ప్రభుత్వ నియంత్రణలోని జెడ్‌టీఈ కంపెనీకి చెందిన ఐదు ప్రాంతాల్లోనూ రైడ్లు జరిగాయి.
