కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు.. సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ టీమ్
అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. సెర్చ్ వారెంట్‌తో చేరుకున్న ఈడీ టీమ్ కేజ్రీవాల్, ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా, కేజ్రీవాల్ టీమ్ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా ఈడీ అధికారులను ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు ఇవాళ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రూలింగ్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సుమారు 12 మంది ఈడీ అధికారుల బృందం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు.
సెర్చ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఈడీ అధికారులు వచ్చిన తర్వాత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్.. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు సీఎం నివాసానికి వచ్చిన తీరు.. ఇతరులను ఎవరినీ లోనికి అనుమతించని వైనాన్ని చూస్తే.. సోదాలు చేస్తున్నట్టు అర్థం అవుతున్నదని వివరించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
దీంతో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ టీమ్ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తక్షణమే తమ పిటిషన్ విచారించాలని విజ్ఞప్తి చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిది సార్లు సమన్లు పంపింది. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.