మనీలాండరింగ్ కేసులో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ ఛార్జీషీటు దాఖలు చేసింది. 2002 నుంచి 2012 మధ్య కాలంలో ముఖ్యమంత్రి హోదాలో జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వున్న ఫరూక్ అబ్ధుల్లా ఆ సమయంలో బీసీసీఐ ఇచ్చిన నిధులను అక్రమ మార్గంలో తరలించారని ఆరోపణలు వచ్చాయి. 

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఛార్జీషీటు దాఖలు చేశారు. జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన నిధుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 2002 నుంచి 2012 మధ్య కాలంలో ముఖ్యమంత్రి హోదాలో జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వున్న ఫరూక్ అబ్ధుల్లా ఆ సమయంలో బీసీసీఐ ఇచ్చిన నిధులను అక్రమ మార్గంలో తరలించారని ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.