దేశంలోని పలు చైనీస్ సంస్థలపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది. చైనీస్ కంపెనీలకు చెందిన 40 కంటే ఎక్కువ ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
దేశంలోని పలు చైనీస్ సంస్థలపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది. చైనీస్ మొబైల్ కంపెనీలకు చెందిన 40 కంటే ఎక్కువ ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లతో పాటుగా కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్టుగా సీఎన్‌బీసీ టీవీ-18 పేర్కొంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. చైనా గాడ్జెట్ దిగ్గజం స్థానిక విభాగమైన Xiaomi ఇండియా నుంచి రూ. 5,551.27 కోట్లను సీజ్ చేసినట్టుగా ఈ ఏడాది ఏప్రిల్ 30న ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీ బ్యాంక్ ఖాతాల నుంచి సీజ్ చేసినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్రమ చెల్లింపులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఈడీ తెలిపింది. ‘‘కంపెనీ 5551.27 కోట్ల రూపాయలకు సమానమైన విదేశీ కరెన్సీని మూడు విదేశీ ఆధారిత సంస్థలకు పంపింది.. ఇందులో ఒకటి Xiaomi గ్రూప్ సంస్థ రాయల్టీ ముసుగులో ఉంది’’ అని ఈడీ పేర్కొంది.
