Asianet News TeluguAsianet News Telugu

బైజూస్‌పై సీఈవో రవీంద్రన్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..!!

ప్రముఖ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌‌కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది.

ED conducts searches at Byjus over alleged FEMA violations ksm
Author
First Published Apr 29, 2023, 12:55 PM IST

బెంగళూరు: ప్రముఖ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌‌కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)  నిబంధనల ప్రకారం రవీంద్రన్, ఆయన కంపెనీ 'థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై కేసుకు సంబంధించి ఈడీ బెంగళూరులోని రెండు వ్యాపార సముదాయలు, ఒక నివాస సముదాయంలో సోదా చేసింది. ఈ సోదాల్లో పలు నేరారోపణ పత్రాలు, డేటా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 

ఈడీ వర్గాల ప్రకారం.. కంపెనీ 2011, 2023 మధ్య  రూ. 28,000 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో అదే కాలంలో వివిధ విదేశీ సంస్థలకు సుమారు రూ. 9,754 కోట్లను పంపింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. రవీంద్రన్ బైజూస్‌కు అనేక సమన్లు జారీ చేయగా.. ఆయన  ఈడీ ముందు హాజరుకాలేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే సోదాలు జరిపినట్టుగా ఈడీ వెల్లడించింది.  2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదని, ఖాతాలను ఆడిట్ చేయలేదని ఈడీ పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios