Asianet News TeluguAsianet News Telugu

ED Case on Sachin Joshi: హీరో సచిన్ జోషికి ఈడీ ఝలక్

ED Case on Sachin Joshi: మనీలాండరింగ్  కేసులో ప్ర‌ముఖ‌ నటుడు, వ్యాపారవేత్త సచిన్​ జోషికి  షాక్ ఇచ్చింది. ఆయ‌న‌కు  చెందిన వైకింగ్​​ గ్రూప్​ నుంచి రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది. ఇందులో ఓంకార్ గ్రూప్​కు చెందిన రూ.330 కోట్ల విలువ కలిగిన ఫ్లాట్​ను, సచిన్ జోషికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. 

ED attaches assets worth Rs 380 crore of Sachin Joshi in PMLA case
Author
Hyderabad, First Published Jan 15, 2022, 7:21 PM IST

ED Case on Sachin Joshi: మనీలాండరింగ్  కేసులో మహారాష్ట్రకు చెందిన రియల్టీ గ్రూప్ ఓంకార్ రియల్టర్స్, నటుడు, వ్యాపారవేత్త సచిన్​ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయ‌న‌కు చెందిన వైకింగ్​​ గ్రూప్​ నుంచి రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది. అలాగే ఈ కేసులో భాగంగా ఓంకార్ గ్రూప్​కు చెందిన రూ.330 కోట్ల విలువ కలిగిన ఫ్లాట్​ను, సచిన్ జోషికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయి స్లమ్​ రీహబిలిటేషన్ అథారిటీ(ఎస్​ఆర్​ఏ) స్కీం ప్రాజెక్టులో  ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

స‌చిన్ జోషి.. తెలుగు,హిందీ సినిమాల్లో నటించారు. ఆయ‌న‌ గుట్కా,  పాన్ మసాలా తయారీ, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న JMJ గ్రూప్ ప్రమోటర్,  వ్యాపారవేత్త JM జోషి కుమారుడు. సచిన్ జోషి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ముంబయి స్లమ్​ రీహబిలిటేషన్ అథారిటీ(ఎస్​ఆర్​ఏ) స్కీం ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఔరంగాబాద్​లో ఓ వ్యాపార వేత్త కేసు నమోదు చేశారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2016లో లబ్దిదారుల సంఖ్యను పెంచారని, అలాగే.. ఈ ప్రాజెక్టును ఓంకార్ గ్రూప్ తీసుకోగానే.. ఫ్లాట్ విలువనురూ.2.5 కోట్ల నుంచి రూ.4కోట్లకు ఎస్ఆర్ఏ అధికారులు పెంచారని ఈడీ  ఆరోపించింది. 

ఈ క్ర‌మంలో అక్రమ పత్రాలను సృష్టించి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీని తిరిగి అభివృద్ధి చేయడానికి యెస్ బ్యాంక్ నుండి  రూ. 410 కోట్ల రుణాన్ని తీసుకుని.. ఆ నిధుల‌ను మళ్లించారనే ఆరోపణలపై  ఔరంగాబాద్ లో 2020లో ఓంకార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాబుల్ శర్మ, ఛైర్మన్ కమల్ కిషోర్​లపై  కేసు న‌మోదు అయ్యింది. దాని ఆధారంగా  సెంట్రల్ ఏజెన్సీ ద‌ర్యాప్తు చేసింది. ఈ ప్రాజెక్టుకు ప్రమోటర్ గా ఉన్న జేఎమ్​ జోషి గ్రూప్ ప్రమోటర్​ సచిన్​ జోషిపై కూడా ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది.

గత ఏడాది జనవరిలో ఈ ముగ్గురుపై ఈడీ దాడులు చేసి.. అనంత‌రం మార్చిలో ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో ఓంకార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాబుల్ శర్మ, ఛైర్మన్ కమల్ కిషోర్​, జేఎమ్​ జోషి గ్రూప్ ప్రమోటర్​ సచిన్​ జోషి ల‌ను  అరెస్టు చేసింది. ఈ క్ర‌మంలో గ‌తేడాది సెప్టెంబర్‌లో సచిన్ జోషికి సుప్రీంకోర్టు నాలుగు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, మిగిలిన ఇద్దరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios