దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‌కు చెందిన రూ.305 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పెద్ద మొత్తంలో హవాలా మార్గంలో దుబాయ్‌కి నిధులు మళ్లించినట్లుగా తెలుస్తోంది.
దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. రూ.305 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ ఉత్తర్వులు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించినట్లుగా దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో హవాలా మార్గంలో దుబాయ్‌కి నిధులు మళ్లించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
