పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు అరెస్ట్ చేసింది.  రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 26 గంటలపాటు విచారణ అనంతరం ఈడీ అధికారులు పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఇక, మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ప్రాంగణంలో జరిగిన సోదాల్లో 20 కోట్ల రూపాయల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు ఉపాధ్యాయ నియామకాల స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

ఇక, ఈ కేసుకు సంబంధించి పార్థ ఛటర్జీని శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను శనివారం ఉదయం ఈడీ అధికారులు అరెస్ట్ చేశార. పార్థ ఛటర్జీలని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

Also Read:SSC Scam Bengal : ఎవ‌రీ అర్పితా ముఖర్జీ ? వెస్ట్ బెంగాల్ మంత్రి పార్ట ఛ‌ట‌ర్జీకి ఆమెకు ఏంటి సంబంధం.. ?

ఇక, పార్థ ఛటర్జీ బెంగాల్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది, 11, 12 తరగతుల సహాయక ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలపై కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ అధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తుంది. 

దక్షిణ కోల్‌కతాలోని ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఆస్తులపై సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న నగదు టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబందించినదిగా అనుమానిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు లెక్కింపు యంత్రాలతో స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కించడానికి ఈడీ బృందం.. బ్యాంక్ అధికారుల సహాయం కోరింది. ముఖర్జీ ప్రాంగణంలో 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని ఈడీ తెలిపింది. వాటి ఉపయోగం గురించి ఆరా తీస్తున్నట్టుగా పేర్కొంది. 

ఇక, ఈ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య, స్కూల్ సర్వీస్ కమిషన్ మాజీ సలహాదారు SP సిన్హా, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కళ్యాణ్‌మోయ్ గంగూలీలకు సంబంధించిన ఆస్తులపై కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.