Raiganj: బీజేపీ రెబల్ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి. ఇటీవల టీఎంసీలో చేరిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యే కార్యాలయం, నివాసంపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహించాయి. పారామిలటరీ బలగాలతో కేంద్ర సంస్థలు సంప్రదింపులు జరపగా, ఆయన కంపెనీకి చెందిన కొన్ని లావాదేవీలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనలోకి వచ్చాయి.
ED, I-T raids at bjp rebel MLA Krishna Kalyani's office: బీజేపీ రెబల్ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహించాయి. ఇటీవల టీఎంసీలో చేరిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యే కార్యాలయం, నివాసంపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహించాయి. పారామిలటరీ బలగాలతో కేంద్ర సంస్థలు సంప్రదింపులు జరపగా, ఆయన కంపెనీకి చెందిన కొన్ని లావాదేవీలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనలోకి వచ్చాయి. "బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి కార్యాలయం, నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ గురువారం 30 గంటల పాటు సోదాలను పూర్తి చేశాయని" సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌గంజ్ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ పై పోటీ చేసిన కృష్ణ కళ్యాణి.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోకి మారారు. ఇక తాజాగా తన కంపెనీకి చెందిన కొన్ని వ్యాపార లావాదేవీలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనలోకి రావడంతో ఆయన దర్యాప్తు ఏజెన్సీల దాడులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల బృందం బుధవారం ఉదయం ఆయన ఇంట్లోకి ప్రవేశించి గురువారం సాయంత్రం 5 గంటల వరకు సోదాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. దీనిపై స్పందించిన కృష్ణ కళ్యాణి సోదరుడు ప్రదీప్ కళ్యాణి.. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. కావాలనే రాజకీయంగా అధికార పార్టీ తమను టార్గెట్ చేసిందంటూ విమర్శించారు.
