న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందుగా ఆర్థిక సర్వేను  గురువారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టనున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో  పెట్టుబడులు, సంపద పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక సర్వే తేల్చి చెప్పింది. ద్రవ్యలోటు 5.8 శాతం ఉండే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది.

2019-20లో చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సర్వే తేల్చిచెప్పింది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరేందుకు 8 శాతం వృద్ధిరేటు అవసరమని సర్వే తేల్చి చెప్పింది. 7 శాతం వృద్ధిరేటును సాధించే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది.