Asianet News TeluguAsianet News Telugu

Assembly Elections2022: అభ్య‌ర్థుల ఎన్నిక‌ల వ్యయాన్ని భారీగా పెంచిన ఈసీ

Assembly Elections2022: దేశంలో త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అభ్య‌ర్థులు ఎన్నిక‌ల వ్య‌యాన్నిపెంచుతూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (Election Commission) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 

EC hikes expenditure limits for candidates ahead of Assembly polls
Author
Hyderabad, First Published Jan 7, 2022, 2:57 PM IST

Assembly Elections2022: దేశంలో త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,గోవా,మ‌ణిపూర్ ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఎన్నిక‌ల సంఘం (Election Commission) దీనికి ఏర్పాట్లు చేస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఎన్నిక‌ల న‌గారా మోడించ‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ సిద్ధ‌మవుత‌న్న‌ద‌ని స‌మాచారం. నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ప్ర‌చారంలో వేగం పెంచిన రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. రెచ్చిపోతున్నారు. రాజ‌కీయ కాక‌రేపుతున్నారు. యూపీ, పంజాబ్‌లో ఈ ఎన్నిక‌ల వేడి మాములుగా లేదు. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్య‌ర్థుల ఎన్నిక‌ల వ్య‌యాన్నిపెంచుతూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (Election Commission) నిర్ణ‌యం తీసుకుంది.  ఇది అభ్య‌ర్థుల‌కు అనుకూలించే అంశ‌మ‌నే చెప్పాలి. ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల అభ్య‌ర్థులు పెట్టే ఖ‌ర్చుల ప‌రిమితిని పెంచింది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థులు 95 ల‌క్ష‌లు,  అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల స‌భ్యులు 40 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల కోసం ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ఎల‌క్ష‌న్ బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల ఖ‌ర్చుల‌ను పెంచ‌డంతో  వారికి ఊర‌ట క‌లిగించే అంశం అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల వ్యయాల‌కు సంబంధించి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థులు 2014 వ‌ర‌కూ 70 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న ఉండేది.  ప్ర‌స్తుతం ఈసీ తీసుకున్న నిర్ణ‌యంతో ఇప్పుడు  అభ్య‌ర్థులు 95 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. 54 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసే నిబంధ‌న ఉన్న ప్రాంతాల్లో 75 ల‌క్ష‌ల‌ను ఖ‌ర్చుచేసుకోవ‌చ్చు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల ఎన్నిక‌ల వ్య‌యాల‌తో పాటు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంచిన వ్య‌యాలు సైతం పెంచింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థులు 28 ల‌క్ష‌ల ఖ‌ర్చు చేయాల‌న్న నిబంధ‌న మార్పు త‌ర్వాత వారు  40 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. అదే 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల‌న్న నిబంధ‌న ఉన్న వారు తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం 28 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టి నుంచి జ‌రిగే అన్ని ఎన్నిక‌ల‌కు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి ఉంటాయ‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. వివిధ రాజ‌కీయ పార్టీలు నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు Election Commission తెలిపింది. 

ఇదిలావుండ‌గా, రెండు రోజుల క్రితం వ‌ర‌కు ఐదు ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హడావిడి ఓ రేంజీలో ఉన్న‌ది. అన్ని ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చార హోరును కొన‌సాగించాయి. అయితే, క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌టం.. ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలు, స‌మావేశాలు, స‌భ‌ల‌కు కాస్త విరామం ఇచ్చాయి. అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఏకంగా గ‌త 24 గంట‌ల్లో ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ ప్రారంభ‌మైంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. కానీ, క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు వాయిదా వేయ‌బోమ‌ని ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల‌పై కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మైన అనంత‌రం ఎన్నిక‌ల సంఘం  (Election Commission) ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios