Asianet News TeluguAsianet News Telugu

నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఇదీ...

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ ను ప్రకటించింది. 

 

EC announces election schedule for Bengal, kerala and other states lns
Author
New Delhi, First Published Feb 26, 2021, 4:36 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ ను ప్రకటించింది. 

శుక్రవారంనాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభలకు ఆయన షెడ్యూల్ ను విడుదల చేశారు.

 

పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 124, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.

కరోనా ఛాలెంజ్ ఇంకా ముగియలేదని సీఈసీ చెప్పారు. కరోనా జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్దమౌతున్నట్టుగా ఆయన చెప్పారు. 2021లోనే ఓటర్ల జాబితాను సిద్దం చేశామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 18.68 కోట్ల మంది ఓటర్లున్నారని ఆయన తెలిపారు.వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన వివరించారు. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

 

అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
 మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారుమార్చి 21న తొలి దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశ మార్చి 2వతేదీన  నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 9వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ఏప్రిల్ 1వ తేదీన రెండో దశ ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.  మార్చి 12 తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మూడో విడత అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ 6వ  తేదీన నిర్వహించనున్నారు.మార్చి 12 తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 19న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.

కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కేరళ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 12న నోటిపికేషన్ జారీ చేయనున్నారు. ఒకే విడతలో రాష్ట్రంలోని  14 జిల్లాల్లోని  అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.కేరళలోని అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. 

తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఓకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. కన్యాకుమారి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల కోసం  మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

బెంగాల్ రాష్ట్రంలో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
 తొలి విడత ఎన్నికలు మార్చి 27న నిర్వహిస్తారు. రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. నాలుగో విడత ఏప్రిల్ 10న ఐదో విడత ఏప్రిల్ 27, ఆరో విడత ఏప్రిల్ 22, ఏడో విడత 26, ఎనిమిదో విడత ఏప్రిల్ 29 నిర్వహించనున్నారు.

ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ను మే 2న నిర్వహిస్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రత్యేక బులెటిన్ లో విడుదల చేయనుంది ఈసీ.

 

Follow Us:
Download App:
  • android
  • ios