ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల్లో ఖాళీలుగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించింది. నాలుగు రాష్ట్రాల్లో బై పోల్ నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, బిహార్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించనుంది. 

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తాజాగా, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అయింది. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. బిహార్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లలో ఖాళీగా ఉన్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. కౌంటింగ్ 16వ తేదీన ఉంటుందని తెలిపింది.

Scroll to load tweet…

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంటరీ స్థానానికి, బ్యాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనుంది. వీటితోపాటు ఛత్తీస్‌గడ్‌లోని ఖైరాగడ్ అసెంబ్లీ స్థానానికి, బిహార్‌లోని బొచహాన్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని ఉత్తర కొల్హపూర్ స్థానానికి ఎన్నికల సంఘం బైపోల్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల కోసం మార్చి 17వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా, ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ సమర్పించడానికి చివరి తేదీగా ఈ నెల 24వ తేదీని నిర్ధారించింది. నామినేషన్‌ల పరిశీలన 25వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణ 28వ తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, పైన పేర్కొన్న స్థానాలకు ఉప ఎన్నికలు ఏప్రిల్ 12వ తేదీన జరుగుతాయని వెల్లడించింది. కాగా, కౌంటింగ్ 16వ తేదీన ఉంటుందని వివరించింది.

ఈ నెల 10వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇందులో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, పంజాబ్‌లో అనూహ్యంగా ఆప్ పంజా వేసింది. ఇక్కడ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి ముఖ్యమైన చర్చ జరిగింది. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రెండు కొత్త రికార్డులు సెట్ అయ్యాయి. ఒకటి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండో సారి అధికారంలోకి వస్తున్నది. రెండవది.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మినహా రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న పార్టీగా ఆప్ అవతరించింది. ఇటీవలి కాలం అని ఎందుకు పేర్కొన్నామంటే.. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఏకకాలంలో ఒకటికి మించిన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కానీ, 1989 నుంచి అంటే.. కాంగ్రెస్ ప్రాభవం కుచించుకువస్తున్నప్పటి నుంచి కేవలం కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే ఒకటికి మించిన రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో ఆప్ చేరింది.

ఈ రోజు బీజేపీకి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే ఎన్నికలకు వెళ్లిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. పీఎం మోడీ, సీఎం యోగి ఇద్దరూ తమ ప్రాభవం కోల్పోలేదని స్పష్టం చేసుకున్నారు. యూపీలో గెలిచి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. 

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సరైనవారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యోగి ఆదిత్యానాథ్(వైఏ) వర్సెస్ అఖిలేశ్ యాదవ్(ఏవై)గా చూశారు. కాగా, బెహెన్ జీ మాయావతి, కాంగ్రెస్‌లు పోటీలో వెనుకంజలోనే కొనసాగాయి. ఈ రెండు పార్టీలూ ఊహించని విధంగా క్షీణించిపోయాయి. బీఎస్పీ ఒక సీటు, కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం అయ్యాయి. యూపీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి.