అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈబీసీ బిల్లు నేడు రాజ్యసభ ముందుకురానుంది.  మధ్యాహ్నం 12 గంటలకు సభలో బిల్లు ప్రవేశపెడతారు.. అనంతరం 2 గంటలకు ఛైర్మన్ సభలో చర్చకు అనుమతిస్తారు.

మరోవైపు ఈబీసీ బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని పలు పార్టీలు నిర్ణయించగా, ఆర్జేడీ తాము దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. నిన్న ఈబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ఎంపీల బలం ఉండటంతో దిగువ సభలో బిల్లు సునాయసంగా ఆమోదం పొందింది. ఓటింగ్‌లో మొత్తం 326 మంది సభ్యులు పాల్గొనగా ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు అనుకూలంగా, వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి. 
 

ఈబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం